LATEST UPDATES

Tuesday, April 16, 2024

సీతారాముల కళ్యాణం మ. 12 గంటలకే ఎందుకు జరిపిస్తారు?

             శ్రీ రాముడు త్రేతాయుగంలో చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12కు జన్మించినట్లు పురాణాల్లో ఉంది. ఇదే ముహూర్తాన శ్రీ రాముని పట్టాభిషేకం జరగడం విశేషం. అలాగే రాముడు అవతరించిన రోజునే కళ్యాణం జరిపించాలని పురాణగాధలు చెబుతున్నాయి. అందుకే రాముడు పుట్టిన సమయాన్ని వివాహ సమయంగా నిర్ణయించి ఏళ్లుగా పండితులు కళ్యాణం జరిపిస్తున్నారు.

శ్రీ రామ నవమి: నేటి నుండి ఒంటిమిట్ట కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు:

        ఏప్రిల్ 17 బుధవారం శ్రీరామనవమి. దేశ వ్యాప్తంగా ఉన్న వైష్ణవ ఆలయాల్లో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. అయితే వీటన్నిటి కన్నా  ఒంటిమిట్ట చాలా చాలా ప్రత్యేకం. ఎందుకంటే సాధారణంగా నవమి రోజు మధ్యాహ్నం సమంలో సీతారాముల కళ్యాణం జరుగుతుంది. కానీ ఒంటిమిట్టలో మాత్రం చైత్ర పౌర్ణమి రోజు వెన్నెల్లో కళ్యాణం జరుగుతుంది. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో  బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేసింది.  ఏప్రిల్ 12వ తేదీన‌ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనంతో వేడుకలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 13వ తేదీ ఉదయం పసుపు దంచే కార్యక్రమం నిర్వహించారు. ఏప్రిల్ 17న ప్రారంభం అయ్యే బ్రహ్మోత్సవాలు 25వ తేదీ వ‌ర‌కు జరుగుతాయి. ఏప్రిల్ 23 చైత్ర పౌర్ణమి కావడంతో ఆ రోజు రాత్రి వెన్నెల్లో కళ్యాణం జరిపిస్తారు..



Picture Courtesy: Way2news



Sunday, April 14, 2024

Sri Varaha Lakshmi Narasimha Swamy Kalyanotsavam Dates 2024 – Simhachalam

Sri Varaha Lakshmi Narasimha temple, Simhachalam, is a Hindu temple situated on the Simhachalam Hill Range,which is 300 metres above the sea level in the city of Visakhapatnam, Andhra Pradesh, India. It is dedicated to Lord Vishnu, who is worshipped there as Varaha Narasimha. Locals call this deity as "Simhachala Appanna"

Simhachalam is the second-largest temple, after Tirumala in Andhra Pradesh, in terms of income earned. Devotees believe that the deity is capable of giving progeny to women and fulfilling the wishes of devotees. Kalyanotsava and Chandanotsava are the two major festivals celebrated in the temple, followed by Narasimha Jayanti, Navaratrotsava and Kamadahana.

The annual Kalyanotsavam of Sri Varaha Lakshmi Narasimha Swamy of Simhachalam will be held on April 19.

The annual ‘Nijarupa darshanam’, popularly known as ‘Chandanotsavam’, will be held on May 10. Thousands of devotees from North Andhra, other parts of Andhra and also neighbouring Odisha State participate in large numbers in the annual Chandanotsavam.

Brahmotsavam Schedule 2024:

April 18 – Ankurarpana, Mrutsyagrahanam

April 19 – Kotnala Utsavam, Rathotsavam(08:15 pm),                                                        Kalyana mahotsavam (10:30 pm)

April 20 – Sesha Vahana Seva (05:00 pm), Homam(07:00 pm)

April 21 – Sadyasam, Tiruveedi Seva

April 22 – Suryaprabha Vahana Seva

April 23 – Purnahuthi, Vasantotsavam, Chakra Snanam, Mrugayotsavam

April 24 – Sri Pushpa Yagam(06:00 pm), Uyyala Seva

How to Reach the Temple :

This temple is Located around 15 km from Gajuvaka, Vizag. 

Thrissur Pooram Festival of Kerala - The Pooram Festival

The Thrissur Pooram Festival is an annual Hindu festival held in Thrissur, KeralaIndia. It is held at the Vadakkunnathan (Shiva) Temple in Thrissur every year on the Pooram (pronounced [puːɾam]) day—the day when the moon rises with the Pooram star in the Malayalam Calendar month of Medam (mid-April to mid-may). It is the largest and most famous of all poorams in India.  Thrissur pooram is also one of the largest festivals in Asia with more than 1 million visitors. Thrissur, is the cultural capital of Kerala.

This year Festival will be held on 19th April 2024.

Pooram is one of the 27 nakshatras (stars) and has got significance due to its auspiciousness. Thrissur Pooram is basically an elephant procession between a huge assembly of people in rhythm with the display of fireworks. This festival lasts for three days.

 

Thrissur Pooram was the brainchild of Sakthan Thampuran, the Maharaja of Cochin (1790–1805). Before the start of Thrissur Pooram, the largest temple festival in Kerala was the one-day festival held at Aarattupuzha known as Arattupuzha Pooram. Temples in and around the city of Thrissur were regular participants. In the year 1796 because of incessant rains, the temples from Thrissur Groups (Paramekkavu, Thiruvambadi, Chempukkavu, Karamukku, Lalur, Ayyanthol, Chakkulathukavu, Neythalakavu and Kanimangalam Temples) were late for the Arattupuzha Pooram and were denied access to the Pooram procession. Feeling embarrassed and angered by the denial, the banned temple groups complained to Sakthan Thampuran. He decided to challenge the ban by starting Thrissur Pooram on the Pooram day in the month of May in the same year as a mass festival. He invited temples with their deities to the city of Thrissur to pay obeisance to Vadakkunnathan (Shiva), the presiding deity of the Vadakkunnathan Temple. Something unique about this festival is that everything used in the festival is made fresh every year from scratch. There are people who are given the duty to craft the umbrellas and the nettipattam.

A resplendent festival celebrated with a grand display of caparisoned elephants, dazzling parasols, and percussion music, the Thrissur Pooram is a magnificent spectacle merging the spiritual and cultural essence of Kerala. These elephants are decorated with different colors, bells, and clothes with all types of ornaments and nettipattam (headbands) and are processed through the middle of the town before assembling at the thekkinkadu maidan. The big parasol is also a point of attraction to the people.

Flag Hoisting:

The pooram officially begins from the event of flag hoisting. The flag hosting ceremony (Kodiyettam) begins seven days before Thrissur Pooram.

Poora Vilambharam:

Poora Vilambaram is a custom where the elephant pushes open the south entrance gate of the Vadakkunnathan Temple, which hosts the Thrissur Pooram, with the idol of 'Neithilakkavilamma' top it.

 

Farewell ceremony:

The seventh day of the pooram is the last day. It is also known as "Pakal Pooram". For the people of Thrissur, the pooram is not only a festival but also a time for hospitality. Upacharam Cholli Piriyal (farewell ceremony) is the last event held at Swaraj Round. Thiruvambadi Sri Krishna Temple and Paramekkavu Bagavathi Temple idols were taken from the Swaraj Round to their respective temples to mark the end of the Pooram celebrations. The festival ends with display of fireworks known as Pakal Vedikkettu.

 

How to Reach the Temple :

 This temple can be reached by


 

Disclaimer:

In Kerala, festival dates are decided in accordance with the Malayalam calendar and the local traditions and customs. We have calculated the festival dates based on these. But there can be changes in the dates according the customs and rituals associated with each place of worship. As such, these should be considered only as approximate dates and have to be confirmed with the local authorities.

Tuesday, April 9, 2024

సృష్టి ఆరంభమైన దినమే ఉగాది!

        ఉగ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది. అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. చైత్ర శుక్ల పాడ్యమినాడు బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని, సృష్టి ఆరంభించిన (కృత యుగం) సంకేతంగా ఉగాది జరుపుకొంటారు.  అలాగే సోమకుడు వేదాలను తిరస్కరించటంతో విష్ణువు మత్స్యావతారంలో అతడిని సంహరించి, వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగిస్తాడు సందర్బంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఒక్కో ఏడాది వచ్చే ఉగాదిని ఒక్కో పేరుతో పిలుస్తారు.

ఉగాది రోజు ఏం చేయాలి? ఉగాది పండుగ శోభ!!

ఉగాది రోజు ఉదయాన్నే తలంటు స్నానం చేసి కొత్త దుస్తులు ధరించాలి. మీ ఇష్ట దైవ దర్శనం చేసుకొని, పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి. ఇంటిని మామిడి, పూల తోరణాలతో అలంకరించుకోవాలి. దైవార్చన, పంచాంగ పూజ చేయాలి. ఉగాది పచ్చడి, పిండివంటలు నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం పంచాంగ శ్రవణం, కవిత్వ, సాహిత్య గోష్ఠులలో పాల్గొనటం ఆనవాయితీగా వస్తోంది.


షడ్రుచుల ఉగాది పచ్చడి తయారీ

    ఉగాది పండుగలో ప్రధానమైనది ఉగాది పచ్చడి. తీపి, కారం, చేదు, పులుపు, వగరు, ఉప్పు వంటి షడ్రుచుల సమ్మేళనమే  ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి తయారీకి సన్నగా తరిగిన మామిడి ముక్కలు, కప్పు చింతపండు రసం, అరకప్పు బెల్లం, కొద్దిగా వేప పువ్వు,  టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి. వీటన్నింటిని ఒక గిన్నెలోకి తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.  ఇలా పచ్చడి చేసుకోవడం వెనుక గల అంతరార్థం ఏమిటంటే  సంవత్సరమంతా మన జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించగల స్థిత ప్రజ్ఞతను సాధించడమే!

సంవత్సరాల పేర్లు- పురాణ గాథ

తెలుగు సంవత్సరాల వెనుక  కథ ఉంది. నారద మహాముని ఓసారి విష్ణు మాయ వల్ల స్త్రీగా మారి,  రాజును పెళ్లాడతాడు. వారికి 60 మంది పుత్రులు జన్మించారు. ఓసారి  రాజు తన పుత్రులతో కలిసి యుద్దానికి వెళ్ళినప్పుడు కుమారులంతా చనిపోతారు. అప్పుడు పుత్రశోకంలో ఉన్న నారదుడిని ఆవరించిన మాయను తొలగించిన విష్ణువు,  ఇది సంసారం అని హితబోధ చేశాడు. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.



ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.




తెలుగు సంవత్సరాలు ఎన్ని? వాటి పేర్లు ఏమిటి?

తెలుగు సంవత్సరాలు 60 అని అందరికి తెలుసు, ప్రభవ నామ సంవత్సరంతో మొదలై అక్షయ వరకు ఉంటాయి. అసలు  పేర్లు ఎలా వచ్చాయి? కేవలం 60 మాత్రమే ఎందుకు ఉన్నాయి తెలుసుకొందాం.

తెలుగు సంవత్సరాల వెనుక  కథ ఉంది. ఒకానొక సమయంలో నారద ముని తనకన్నా గొప్ప భక్తుడు లేదు అని, తాను గొప్ప జ్ఞానీ అని, గర్వంతో విర్రవీగుతుంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అతడికి జ్ఞానబోధ చేయాలని తలచి మాయ ఆవరించేలా చేస్తాడు. నారదుణ్ణి ఒక సరస్సుకి తీసుకెళ్లి అందులో స్నానమాచరించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు, నారదుడు అందులో దిగి స్నానం చేయగానే, అతని పూర్వ స్మృతిని మరచిపోయి, స్త్రీ రూపం ఎత్తుతాడు. తరువాత  రాజును పెళ్లాడతాడు. వారికి 60 మంది పుత్రులు జన్మించారు. ఓసారి  రాజు తన పుత్రులతో కలిసి యుద్దానికి వెళ్ళినప్పుడు కుమారులంతా చనిపోతారు. అప్పుడు పుత్రశోకంలో ఉన్న నారదుడిని ఆవరించిన మాయను తొలగించిన విష్ణువు,  ఇది సంసారం అని హితబోధ చేశాడు. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.

మన తెలుగు సంవత్సరాల పేర్లు :

1. ప్రభవ, 2. విభవ, 3. శుక్ల, 4. ప్రమోదూత, 5. ప్రజోత్పత్తి, 6. ఆంగీరస, 7. శ్రీముఖ, 8. భవ, 9. యువ, 10. ధాత, 11. ఈశ్వర, 12. బహుధాన్య, 13. ప్రమాథి, 14. విక్రయ, 15. వృక్ష, 16. చిత్రభాను, 17. స్వభాను, 18. తారణ, 19. పార్థివ, 20. వ్యయ, 21. సర్వజిత్, 22. సర్వధారి, 23. విరోధి, 24. వికృతి, 25. ఖర, 26. నందన, 27. విజయ, 28. జయ, 29. మన్మథ, 30. దుర్ముఖి, 31. హేవలంభి, 32. విలంబి, 33. వికారి, 34. శార్వరి, 35. ప్లవ, 36. శుభకృత్, 37. శోభకృత్, 38. క్రోధి, 39. విశ్వావసు, 40. పరాభవ, 41. ప్లవంగ, 42. కీలక, 43. సౌమ్య, 44. సాధారణ, 45. విరోధికృత్, 46. పరీధావి, 47. ప్రమాదీచ, 48. ఆనంద, 49. రాక్షస, 50. నల, 51. పింగళ, 52. కాళయుక్త, 53. సిద్ధార్థి, 54. రౌద్రి, 55. దుర్మతి, 56. దుందుబి, 57. రుధిరోద్గారి, 58. రక్తాక్షి, 59. క్రోధన, 60. అక్షయ.


ఇలా 60 ఏళ్లు పూర్తయిన వారు షష్టి పూర్తి చేసుకుంటారు. అరవై ఏళ్ళ తర్వాత సంవత్సర చక్రం పూర్తయినట్లే మనిషి రెండో బాల్య దశకు వస్తాడట. అక్కడి నుంచి మనుషుల శరీరంలో మార్పులు మొదలవుతాయి, క్రమంగా జ్ఞాపకశక్తి తగ్గుతూ వస్తుంది చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. అకారణంగా అలగటం అవీ ఇవీ తినాలనే కోరిక కలగటం, ఎక్కువ సేపు నిద్రపోవడం, చిన్న చిన్న విషయాలకే ఆనంద పడటం, కోపం తెచ్చుకోవడం, కన్నీళ్ళు పెట్టుకోవడం వంటి బాల్య చేష్టలన్నీ 60 తర్వాత మళ్ళీ ప్రారంభం అవుతాయి.అప్పటి నుంచి ప్రతిబిడ్డ తన తల్లి దండ్రులను బిడ్డలతో సమానంగా చూసుకోవాలని ధర్మశాస్త్రం చెపుతుంది


@2017 All Rights Reserved. Designed by WWW.SMARTWAY4STUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates