శ్రీ రామ నవమి: నేటి నుండి ఒంటిమిట్ట కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు:
ఏప్రిల్ 17 బుధవారం శ్రీరామనవమి. దేశ వ్యాప్తంగా ఉన్న వైష్ణవ ఆలయాల్లో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. అయితే వీటన్నిటి కన్నా ఒంటిమిట్ట చాలా చాలా ప్రత్యేకం. ఎందుకంటే సాధారణంగా నవమి రోజు మధ్యాహ్నం సమంలో సీతారాముల కళ్యాణం జరుగుతుంది. కానీ ఒంటిమిట్టలో మాత్రం చైత్ర పౌర్ణమి రోజు వెన్నెల్లో కళ్యాణం జరుగుతుంది. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఏప్రిల్ 12వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంతో వేడుకలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 13వ తేదీ ఉదయం పసుపు దంచే కార్యక్రమం నిర్వహించారు. ఏప్రిల్ 17న ప్రారంభం అయ్యే బ్రహ్మోత్సవాలు 25వ తేదీ వరకు జరుగుతాయి. ఏప్రిల్ 23 చైత్ర పౌర్ణమి కావడంతో ఆ రోజు రాత్రి వెన్నెల్లో కళ్యాణం జరిపిస్తారు..
Picture Courtesy: Way2news
No comments:
Post a Comment