పరమ శివుడికి, విష్ణుకి అత్యంత ప్రతికరమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరించడం వలన కార్తీక మాసం అనే పేరు వచ్చింది.
కార్తీక మాసంలో కార్తీక పురాణం వినడం, పఠించడం వల్ల అనంతకోటి పుణ్యం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. శివలింగానికి బిల్వదళాలతో అర్చన చేయడం వలన స్వర్గప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ మాసంలో భక్తులు మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి వంటి వాటికి దూరంగా ఉంటారు. లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఉసిర చెట్టును పూజించి దీపం వెలిగిస్తే ఐశ్వర్యం, జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు. ఈ నెలలో పవిత్ర నదుల్లో బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది.
ఈ నెల మొత్తం పూజలు వ్రతాలు ఉపవాసాలు, వనభోజనాలతో సందడిగా ఉంటుంది.
No comments:
Post a Comment