శోషణం భవసింధోశ్చ ప్రాపణం సారసంపదః |
యస్య పాదోదకం సమ్యక్ తస్మై శ్రీగురవే నమః ||
గురురాదిరణాదిశ్చ గురుః పరమదైవతమ్ |
గురోః పరతరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః
ఎవరు భయంకరమైన భవసాగరాన్ని ఇంకిపోయేలా చేసి, అత్యుత్తమ ఆధ్యాత్మిక సంపదను ప్రాప్తింపజేస్తారో, ఎవరి చరణామృతం (కృప) సంసారమోహాని తొలగించి సమ్యగ్ జ్ఞానాన్ని ప్రసాదిస్తుందో, అటువంటి గురువుకి ప్రణమిల్లుతున్నాను.
గురువే ఈ సృష్టికి ఆది. అయినప్పటికీ ఆయన అనాది. గురువే పరమ దైవం. ఆయనను మించినది ఏమీ లేదు. అటువంటి గురువులకు ప్రణమిల్లు తున్నాను.
మాతృక : విశ్వసారతంత్రం నుండి
No comments:
Post a Comment