LATEST UPDATES

Monday, November 18, 2024

క్షీరాబ్ది ద్వాదశి విశిష్టత

 క్షీరాబ్ది ద్వాదశి:

 క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసంలో శుభప్రదమైన రోజుదీనిని “చిలుక ద్వాదశి” అని కూడా అంటారుఅమృతం కోసం దేవతలుదానవులు పాలసముద్రాన్ని  రోజున చిలికారటఅందుకేదీనిని చిలుకు ద్వాదశి అని కూడా అంటారు. క్షీర సాగర మథన సమయంలో, కామధేను (ఆవు), కల్ప వృక్షం, ఐరావతం (తెల్ల ఏనుగు), అమృతం మరియు లక్ష్మీదేవి వంటి అనేక విషయాలు విస్ఫోటనం చెందుతాయి. శ్రీమహావిష్ణువు  రోజున లక్ష్మీ దేవిని వివాహం చేసుకున్నాడు, ఇది ఒక పవిత్రమైన రోజు.

     ఉత్థాన ఏకాదశి అంటే.. కార్తిక శుక్ల శుద్ధ ఏకాదశిఈ రోజున శ్రీ మహా విష్ణువు 4 నెలల తరువాత యోగ నిద్ర నుండి మేల్కొంటారు.మరుసటి రోజు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీసమేతుడై, బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు.  శ్రీమహా విష్ణువు దామోదరుడు అనే పేరుతో తులసిమాతను వివాహం చేసుకుంటాడు. అందుకే.. విష్ణు సంబంధమైన ఆలయాల్లో క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి దామోదరుల కల్యాణం జరుగుతుంది.

     ఈ రోజున ఉదయాన్నే తలంటు స్నానం చేసి దైవ దర్శనం చేసుకోవాలి అని పండితులు చెబుతున్నారుఈ రోజున ఇంట్లో తులసి మొక్కకు విష్ణువుతో వివాహం జరిపిస్తారుతులసి కళ్యాణం చేయటం వల్ల జీవితంలోని కష్టాలుతొలగిపోయిఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయని నమ్ముతారుఇలా చేయటం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటే సమసిపోతాయని, పెళ్లి కాని యువతీ యువకులకు పెళ్లి జరుగుతుందని నమ్మకం.

 

ముఖ్యగమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

No comments:

Post a Comment

@2017 All Rights Reserved. Designed by WWW.SMARTWAY4STUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates