Saturday, April 05, 2025

LATEST UPDATES
>> భారతదేశంలోని ప్రసిద్ధ నదులు  >> క్షీరాబ్ది ద్వాదశి విశిష్టత  >> కార్తీక మాస విశిష్టత  >> గురుభ్యోనమః -- విశ్వసారతంత్రం నుండి  >> Sri Prasanna Venkateswara Swamy Brahmotsavams 2024 Dates - Appalayagunta    

Friday, May 3, 2024

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS ప్రార్థన

 ప్రార్థన:             

1. నమస్తే సదా వత్సలే మాతృభూమే

      త్వయా హిన్దుభూమే సుఖవ్ వర్ధితోహమ్

      మహామఙ్గలే పుణ్యభూమే త్వదర్థే

      పతత్వేష కాయో నమస్తే నమస్తే ||


2. ప్రభో శక్తిమన్‌ హిన్దు రాష్ట్రాఙ్గభూతా

                ఇమే సాదరన్ త్వాన్ నమామో వయమ్

      త్వదీయాయ కార్యాయ బధ్దా కటీయమ్ 

                శుభామాశిషన్ దేహి తత్పూర్తయే

      అజయ్యాఞచ విశ్వస్య దేహీశ శక్తిమ్ 

                సుశీలన్ జగద్  యేన నమ్రమ్ భవేత్

      శ్రుతఞ చైవ యత్ కణ్టకాకీర్ణ మార్గం

                స్వయం స్వీకృతం నస్ సుగఙ కారయేత్ 


౩. సముత్కర్ష నిస్ శ్రేయ సస్యైక ముగ్రం

              పరమ్ సాధనన్ నామ వీర వ్రతమ్

     తదన్తస్ స్ఫురత్వక్షయా ధ్యేయనిష్ఠా

               హృదన్తః ప్రజాగర్తు తీవ్రానిశమ్‌

     విజేత్రీ చ నస్ సంహతా కార్యశక్తిర్

               విధాయాస్య ధర్మస్య సంరక్షణమ్‌

     పరవ్ వైభవన్ నేతు మేతత్‌ స్వరాష్ట్రమ్ 

               సమర్థా భవత్వాశిశా తే భృశమ్

                                    ||భారత్ మాతా కీ జయ్||


భావము: -

        వాత్సల్య పూర్ణా! ఓ మాతృభూమీ! నేను నీకు ఎల్లప్పుడూ నమస్కరింతును. ఓ హిందుభూమీ, నీ వల్లనే నేను సుఖముగా వర్దిల్లినాను. మహా మంగళమయీ! ఓ పుణ్యభూమీ! నీ కార్య సాధనకై నా ఈ శరీరము సమర్పింపబడుగాక! నీకివే అనేక నమస్కారములు.

        సర్వశక్తిమన్! ఓ పరమేశ్వరా! హిందూ రాష్ట్రమునకు అవయవ స్వరూపులమైన మేము నీకు సాదరముగ నమస్కరించుచున్నాము. నీ కార్యము కొరకే కటి బద్ధులమైయున్నాము. దానిని నెరవేర్చుటకై మాకు శుభాశీస్సుల నిమ్ము. విశ్వము గెలువలేని శక్తిని, ప్రపంచము మోకరిల్లునట్టి సౌశీల్యమును, మేము బుద్ధి పూర్వకముగా స్వీకరించిన మా కణ్టకాకీర్ణ మార్గమును సుగమము చేయునట్టి జ్ఞానమును ప్రసాదింపుము.

        అభ్యుదయ సహిత నిశ్రేయమును పొందుటకై ఒకే ఒక ఉత్తమము, తీక్షణమునైన సాధనము వీర వ్రతము. అది మా అంతః కరణములయందు స్ఫురించుగాక! అక్షయము, తీవ్రమునైన ధ్యేయనిష్ఠ మా హృదయములలో ఎల్లప్పుడూ జాగృతమై యుండుగాక! విజయశీలియైన మా సంఘటిత కార్యశక్తి  మా ధర్మమును సంరక్షించి, మా ఈ దేశమును పరమ వైభవ స్థితికి చేర్చుటలో నీ ఆశీస్సులచే మిక్కిలి సమర్థమగు గాక!

No comments:

Post a Comment

@2017 All Rights Reserved. Designed by WWW.SMARTWAY4STUDY.COM !!!! Sitemap !!!! Seo Blogger Templates