LATEST UPDATES

Thursday, May 16, 2024

జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

    శ్రీ నారాపుర వేంకటేశ్వర దేవాలయం భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, వైఎస్ఆర్ కడప జిల్లా, జమ్మలమడుగులో ఉన్న ఒక పురాతన హిందూ దేవాలయం. ఆలయ చరిత్ర ప్రకారం, ఈ ఆలయానికి వేంకటేశ్వరుని భక్తుడైన నరపురయ్య అనే భక్తుని పేరుమీద ఆ పేరు వచ్చింది, అతను దేవుడి కోరిక మేరకు ఆలయాన్ని నిర్మించాడు. ప్రస్తుతం ఈ ఆలయం 2008 నుంచి టీటీడీ ఆధీనంలో ఉంది. 

        శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 21 నుండి 29వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.  స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 20, 2024   తేదీన అంకురార్పణంతో ప్రారంభమై మే 30న పుష్పయాగంతో ముగుస్తాయి.



బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

21-05-2024

ఉదయం – ధ్వజారోహణం

సాయంత్రం- పెద్దశేష వాహనం

22-05-2024

ఉదయం – చిన్నశేష వాహనం

సాయంత్రం- హంస వాహనం

023-05-2024

ఉదయం – ముత్యపుపందిరి వాహనం

సాయంత్రం- సింహ వాహనం

24-05-2024

ఉదయం – కల్పవృక్ష వాహనం

సాయంత్రం- హనుమంత వాహనం

25-05-2024

ఉదయం – పల్లకీ ఉత్సవం

సాయంత్రం- గరుడ వాహనం

26-05-2024

ఉదయం – సర్వభూపాల వాహనం

సాయంత్రం- కల్యాణోత్సవం, గజ వాహనం

27-05-2024

ఉదయం – రథోత్సవం

సాయంత్రం- అశ్వవాహనం

28-05-2024

ఉదయం – సూర్యప్రభ వాహనం

సాయంత్రం- చంద్రప్రభ వాహనం

29-05-2024

ఉదయం – చక్రస్నానం

సాయంత్రం- ధ్వజావరోహణం


మే 26వ తేదీ సాయంత్రం 6 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. రూ.300/- చెల్లించి గృహస్తులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.

ఆలయానికి ఎలా చేరుకోవాలి:

ఈ దేవాలయం కడపకు 80 కిలోమీటర్ల దూరంలో జమ్మలమడుగులో ఉంది.



టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.




No comments:

Post a Comment

@2017 All Rights Reserved. Designed by WWW.SMARTWAY4STUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates