పద్యం: కల్లలాడువాని గ్రామకర్త యెఱుగు
సత్య మాడువాని స్వామి యెఱుగు
బెద్దతిండిపోతుఁ బెండ్లామెఱుంగురా
విశ్వదాభిరామ వినురవేమ.
సారాంశం: ఈ పద్యంలో వేమన అంటున్నాడు - అసత్యము చెప్పే వాడిని గ్రామపెద్ద గ్రహించి అతనితో ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధముగా వ్యవహరిస్తాడు. నిజము ఎవరు పలుకుతున్నారో సర్వాంతర్యామి అయిన ఆ భగవంతునికి తెలుసు, అందుకే భక్తులు కోరే కోర్కెలను భగవంతుడు తీర్చుతాడు. తిండిపోతు భర్తను భార్య గ్రహించును. అందుకే అతడికి సరిపడు ఆహారమును ఇస్తుంది.
ఇంకా ఇలాంటి వేమన పద్యాల అర్థాలు కావాలా? అయితే మా వెబ్ సైట్ ను ఫాలో అవ్వండి.🎧✅ Here’s the audio voiceover for the Vemana poem in Telugu:
👉 Download Telugu Voiceover Audio
Kallalāḍuvāni grāmakarta yeṟugu
Satya māḍuvāni swāmi yeṟugu
Beddatindipōthu bendlāmeṟungurā
Viśvadābhirāma vinuravēma.
Meaning: The village head recognises a person who lies and treats him accordingly. God knows his people and hence grants their wishes accordingly. Just as a wife understands her gluttonous husband's appetite and feeds him appropriately– Says Kavi Vemana