LATEST UPDATES

Monday, May 5, 2025

వేమన శతకము -- 3

 


పద్యం:   ఎలుకతోలుఁదెచ్చి యేడాది వుతికిన 
            నలుపు నలుపేగాని తెలుపురాదు
            కొయ్యబొమ్మ దెచ్చి కొట్టినఁబలుకునా
            విశ్వదాభిరామ వినురవేమ.

సారాంశం: ఈ పద్యంలో వేమన అంటున్నాడు  - ఎవరి స్వభావాలను మార్చుట ఎవరి తరము కాదు.అని తెలుపుట దీని భావములోని ఆంతర్యముఎలుకతోలు నల్లగా ఉంటుందిదానిని ఒక ఏడాదిపాటు ఉతికినను అది తెల్లబడదుచెక్క బొమ్మను ఎంతబాదిన దానికి ఎటువంటి ప్రభావము ఉండదు.

ఇంకా ఇలాంటి వేమన పద్యాల అర్థాలు కావాలా? అయితే మా వెబ్ సైట్ ను ఫాలో అవ్వండి.

🎧✅ Here’s the audio voiceover for the Vemana poem in Telugu:

👉 Download Telugu Voiceover Audio


elukatholunudechchi yEdaadhi vuthikina

nalupu nalupEgaani thelupuraadhu

koyyabomma dhechchi kottinaAObalukunaa

vishvadhaabhiraama vinuravema.

Meaning: A mouse skin doesn’t whiten even if washed for a year. A wooden toy doesn’t speak even if beaten up. Thus, it is not possible to change the intrinsic qualities of some one – Says Kavi Vemana

వేమన శతకము -- 2


పద్యం: కల్లలాడువాని గ్రామకర్త యెఱుగు
          సత్య మాడువాని స్వామి యెఱుగు
          బెద్దతిండిపోతుఁ బెండ్లామెఱుంగురా
          విశ్వదాభిరామ వినురవేమ.

సారాంశం: ఈ పద్యంలో వేమన అంటున్నాడు  - అసత్యము చెప్పే వాడిని గ్రామపెద్ద గ్రహించి అతనితో  విధంగా ప్రవర్తించాలో ఆ విధముగా వ్యవహరిస్తాడు. నిజము ఎవరు పలుకుతున్నారో సర్వాంతర్యామి అయిన  భగవంతునికి తెలుసు, అందుకే భక్తులు కోరే కోర్కెలను భగవంతుడు తీర్చుతాడు. తిండిపోతు భర్తను భార్య గ్రహించును. అందుకే అతడికి సరిపడు ఆహారమును ఇస్తుంది.

ఇంకా ఇలాంటి వేమన పద్యాల అర్థాలు కావాలా? అయితే మా వెబ్ సైట్ ను ఫాలో అవ్వండి.

🎧✅ Here’s the audio voiceover for the Vemana poem in Telugu:

👉 Download Telugu Voiceover Audio



Kallalāḍuvāni grāmakarta yeṟugu
Satya māḍuvāni swāmi yeṟugu
Beddatindipōthu bendlāmeṟungurā
Viśvadābhirāma vinuravēma.

Meaning: The village head recognises a person who lies and treats him accordingly. God knows his people and hence grants their wishes accordingly. Just as a wife understands her gluttonous husband's appetite and feeds him appropriately– Says Kavi Vemana

Sunday, April 20, 2025

వేమన శతకము -- 1


పద్యం: అన్నిదానములను నన్న దానమే గొప్ప
          కన్నతల్లికంటె ఘనములేదు
          ఎన్నగురునికన్న నెక్కుడు లేడయా
          విశ్వదాభిరామ వినురవేమ.

సారాంశం: ఈ పద్యంలో వేమన అంటున్నాడు  - దానముల అన్నింటికంటే ఘనమైనది అన్నదానము. ఎన్ని దానములు చేసిన అసంతృప్తితో ఉన్నవారు అన్నము దానము చేయుటతోనే సంతుష్టులు అవుతారు. కన్నతల్లి కంటే లోకములో ఉత్తమమైనదిఉన్నతమైనది మరేమీ లేదు. జ్ఞానము ప్రసాదించు గురువు కంటే మించినవారు ఎవరూ లేరు. ఇవి నిత్య సత్యాలు
ఇంకా ఇలాంటి వేమన పద్యాల అర్థాలు కావాలా? అయితే మా వెబ్ సైట్ ను ఫాలో అవ్వండి.

🎧✅ Here’s the audio voiceover for the Vemana poem in Telugu:

👉 Download Telugu Voiceover Audio







Annidānamulanu nanna dāname goppa
Kannatallikantē ghanamulēdu
Ennagirunikanna nekkudu lēḍayā
Viśvadābhirāma vinuravēma


There is nothing equal to giving food to a hungry man; there is no one greater than one's mother; Among all teachers (Gurus), no one is superior—each has their own greatness.. These are eternal truths – says Kavi Vemana

Wednesday, March 5, 2025

భారతదేశంలోని ప్రసిద్ధ నదులు

          మన  పవిత్ర భారతదేశంలో చాలా నదులు ఉన్నాయి.  నదులు మన సంస్కృతిలో ఒక భాగం. మనం వాటిని నదులుగా పరిగణించమువాటిని దేవతలుగా వ్యవహరిస్తాము నదులలో స్నానం చేయడం పుణ్యప్రదమని నమ్ముతాముపుష్కరాలు మరియు కార్తీక మాసంలో చాలా మంది  నదులలో స్నానాలు చేస్తారుమన జీవితంలో నదులకు చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టినేను భారతదేశంలోని ప్రసిద్ధ నదుల  గురించి కొంత సమాచారాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను.

1. గంగా నది :-

         గంగానది భారతదేశంలోనుబంగ్లాదేశ్లోను ప్రధానమైన నదులలో ఒకటి"నీరు" అన్న పదానికి సంస్కృతంలో "గంగా" అన్న పదాన్ని వాడుతారుగంగానదిని "గంగమ్మ తల్లి" అనీ, "పావన గంగ" అనీ, "గంగ భవాని" అని  నదిని హిందువులు స్మరిస్తారు

          ఉత్తరాఖండ్ రాష్ట్రం పరిధిలోని హిమాలయ పర్వతాలలో గంగోత్రి అనే హిమానీనదం (Glacier) లో భాగీరథి నది ఉద్భవిస్తున్నదిప్రవాహ మార్గంలో దేవప్రయాగ వద్ద అలకనంద నది దీనితో కలుస్తుందిఅక్కడి నుండి దీనిని "గంగా" అంటారుకొంత దూరం హిమాలయాలలో ప్రహించిన  నది హరిద్వారం వద్ద మైదాన ప్రాంతంలో ప్రవేశిస్తుందిగంగా నది మొత్తం పొడవు సుమారు 2,525 కి.మీ. (1,557 మైళ్ళు). ఋగ్వేద కాలం నుండి అంటే సుమారు 1700-1100 BC నాటి నుండి గంగానది ఉందని మన పూర్వీకులు నమ్ముతారు.

 ప్రతి హిందువు తమ జీవితంలో ఒక్కసారైనా గంగా నదిలో స్నానం చేయాలని కోరుకుంటారు. కాశీలోని గంగా నది ఒడ్డున తుది శ్వాస తీసుకోవడం ద్వారా వారు సులభంగా మోక్షం పొందుతారని ప్రజలు విశ్వసిస్తారు, కాబట్టి గతంలో చాలా మంది వృద్ధులు తమ చివరి రోజులు గడిపేందుకు కాశీకి వెళ్లి అక్కడే ఉండిపోయేవారుగంగాజలం చాలా పవిత్రమైనదిదానిలోని మలినాలను దానంతటదే శుభ్రం చేయగలదని నిరూపించబడిందిఎక్కువ రోజులు నిల్వ ఉంచితే చెడిపోదుకాశీని దర్శించినాగంగాస్నానం చేసినా మనకు వచ్చే జన్మ ఉండదని పురాణాల ద్వారా తెలుసుకోవచ్చు.

          గంగా నది తీరాన కుంభ మేళ, ఛత్పూజ వంటి ఉత్సవాలు జరుగుతాయి. కుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్ద జనసమూహం కూడుకొనే ఉత్సవంవారణాసి హిందువులకు పరమ పవిత్ర స్థానం

జనసాంద్రత అధికంగా ఉన్న ప్రదేశాలు గంగానదికి ఇరువైపులా ఉన్నందున, ఇప్పుడు  పవిత్ర నది చాలా కలుషితమై ఉంది నది తనంతట తాను శుభ్రం చేసుకోలేని విధంగా కలుషితం అవుతోంది, కాబట్టి మన ప్రభుత్వం "గంగా యాక్షన్ ప్లాన్"  పేరుతో గంగా జలాన్ని శుద్ధి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది.


@2017 All Rights Reserved. Designed by WWW.SMARTWAY4STUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates