Tuesday, April 01, 2025

LATEST UPDATES
>> భారతదేశంలోని ప్రసిద్ధ నదులు  >> క్షీరాబ్ది ద్వాదశి విశిష్టత  >> కార్తీక మాస విశిష్టత  >> గురుభ్యోనమః -- విశ్వసారతంత్రం నుండి  >> Sri Prasanna Venkateswara Swamy Brahmotsavams 2024 Dates - Appalayagunta    

Wednesday, March 5, 2025

భారతదేశంలోని ప్రసిద్ధ నదులు

          మన  పవిత్ర భారతదేశంలో చాలా నదులు ఉన్నాయి.  నదులు మన సంస్కృతిలో ఒక భాగం. మనం వాటిని నదులుగా పరిగణించమువాటిని దేవతలుగా వ్యవహరిస్తాము నదులలో స్నానం చేయడం పుణ్యప్రదమని నమ్ముతాముపుష్కరాలు మరియు కార్తీక మాసంలో చాలా మంది  నదులలో స్నానాలు చేస్తారుమన జీవితంలో నదులకు చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టినేను భారతదేశంలోని ప్రసిద్ధ నదుల  గురించి కొంత సమాచారాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను.

1. గంగా నది :-

         గంగానది భారతదేశంలోనుబంగ్లాదేశ్లోను ప్రధానమైన నదులలో ఒకటి"నీరు" అన్న పదానికి సంస్కృతంలో "గంగా" అన్న పదాన్ని వాడుతారుగంగానదిని "గంగమ్మ తల్లి" అనీ, "పావన గంగ" అనీ, "గంగ భవాని" అని  నదిని హిందువులు స్మరిస్తారు

          ఉత్తరాఖండ్ రాష్ట్రం పరిధిలోని హిమాలయ పర్వతాలలో గంగోత్రి అనే హిమానీనదం (Glacier) లో భాగీరథి నది ఉద్భవిస్తున్నదిప్రవాహ మార్గంలో దేవప్రయాగ వద్ద అలకనంద నది దీనితో కలుస్తుందిఅక్కడి నుండి దీనిని "గంగా" అంటారుకొంత దూరం హిమాలయాలలో ప్రహించిన  నది హరిద్వారం వద్ద మైదాన ప్రాంతంలో ప్రవేశిస్తుందిగంగా నది మొత్తం పొడవు సుమారు 2,525 కి.మీ. (1,557 మైళ్ళు). ఋగ్వేద కాలం నుండి అంటే సుమారు 1700-1100 BC నాటి నుండి గంగానది ఉందని మన పూర్వీకులు నమ్ముతారు.

 ప్రతి హిందువు తమ జీవితంలో ఒక్కసారైనా గంగా నదిలో స్నానం చేయాలని కోరుకుంటారు. కాశీలోని గంగా నది ఒడ్డున తుది శ్వాస తీసుకోవడం ద్వారా వారు సులభంగా మోక్షం పొందుతారని ప్రజలు విశ్వసిస్తారు, కాబట్టి గతంలో చాలా మంది వృద్ధులు తమ చివరి రోజులు గడిపేందుకు కాశీకి వెళ్లి అక్కడే ఉండిపోయేవారుగంగాజలం చాలా పవిత్రమైనదిదానిలోని మలినాలను దానంతటదే శుభ్రం చేయగలదని నిరూపించబడిందిఎక్కువ రోజులు నిల్వ ఉంచితే చెడిపోదుకాశీని దర్శించినాగంగాస్నానం చేసినా మనకు వచ్చే జన్మ ఉండదని పురాణాల ద్వారా తెలుసుకోవచ్చు.

          గంగా నది తీరాన కుంభ మేళ, ఛత్పూజ వంటి ఉత్సవాలు జరుగుతాయి. కుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్ద జనసమూహం కూడుకొనే ఉత్సవంవారణాసి హిందువులకు పరమ పవిత్ర స్థానం

జనసాంద్రత అధికంగా ఉన్న ప్రదేశాలు గంగానదికి ఇరువైపులా ఉన్నందున, ఇప్పుడు  పవిత్ర నది చాలా కలుషితమై ఉంది నది తనంతట తాను శుభ్రం చేసుకోలేని విధంగా కలుషితం అవుతోంది, కాబట్టి మన ప్రభుత్వం "గంగా యాక్షన్ ప్లాన్"  పేరుతో గంగా జలాన్ని శుద్ధి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది.


@2017 All Rights Reserved. Designed by WWW.SMARTWAY4STUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates